ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ను కన్నడ లో N సినిమాస్ బ్యానర్ రిలీజ్ చేయనుంది. ఇదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీ కావడం తో ప్రమోషన్స్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయనున్నారు మేకర్స్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.