టాలీవుడ్ ప్రముఖ హీరో నారా రోహిత్ హీరోగా చాలా రోజులు తర్వాత హీరోగా మళ్ళీ తన పొలిటికల్ హిట్ చిత్రం “ప్రతినిధి” కి సీక్వెల్ తో పలకరించేందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో ప్లాన్ చేసిన చిత్రమే ఇది. మరి ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉన్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది.
మరి ఈ సినిమాకి కొనసాగింపు సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఇందుకు పార్ట్ 2 కూడా ఎలా రన్ అయ్యింది అనేది కూడా ప్రధాన అంశంగా తీసుకోవాలి. మరి ప్రతినిధి 2 ఎలాంటి రన్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, సచిన్ ఖేడేకర్ తదితరులు నటించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. అలాగే కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు సిరి తోట అలాగే సురేంద్రనాథ్ బొల్లినేని లు నిర్మాణం వహించారు.