కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “రాయన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాని మేకర్స్ తమిళ్ సహా హిందీ మరియు మన తెలుగు భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇపుడు తెలుగు రిలీజ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈ చిత్రం ని తెలుగులో ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు అలాగే ఆసియన్ వారు డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ జూన్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి చూడాలి ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో ఎలాంటి సినిమా చేస్తున్నాడో అనేది.