Like us on Facebook
 
‘రంగస్థలం 1985’ పాటలు ఆ హీరోని వెంటాడుతున్నాయట !

సుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకు అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఆడియో ఎలా ఉంటుందో వినాలని తహతహలాడిపోతున్నారు.

చరణ్ చేసిన సినిమాలన్నింటిలోకి ఈ చిత్రం భిన్నమైనది కాబట్టి ఇందులోని పాటలు కూడా అలానే ఉంటాయని ఆశిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పాటలను స్పెషల్ గా విన్న హీరో మంచు మనోజ్ ‘సోదరుడు రామ్ చరణ్ నాకు రంగస్థలం పాటలు వినిపించినప్పటి నుండి అవి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. సినిమా చూడాలని చాలా తొందరగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. స్వతహాగానే సంగీతం పట్ల మంచి అభిరుచి కలిగిన మనోజ్ ను అంతలా ఆకట్టుకున్న రంగస్థలం పాటల్లోని మ్యాజిక్ ఎలాంటిదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Bookmark and Share