ఎన్.టి.ఆర్-పూరి సినిమాకి మణిశర్మ మ్యూజిక్.?

ఎన్.టి.ఆర్-పూరి సినిమాకి మణిశర్మ మ్యూజిక్.?

Published on Sep 30, 2014 6:44 PM IST

Manisharma_NTR
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ప్రసతుతం సెట్స్ పై ఉన్న సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అని రెండు రోజుల క్రితమే చెప్పారు కదా అప్పుడే మణిశర్మని మార్చేసారా అని ఆలోచిస్తున్నారా.. అలా ఆలోచించకండి ఎందుకంటే మణిశర్మ ఈ సినిమాకి ఫుల్ మ్యూజిక్ అందించడం లేదు. అసలు విషయంలోకి వెళితే అనూప్ రూబెన్స్ ఈ సినిమా ఆల్బమ్ కి మాత్రం మ్యూజిక్ చేస్తుంటే మణిశర్మ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. దాంతో ఈ చిత్ర టీం దగ్గర టైం తక్కువగా ఉండడంతో అనుకున్న టైం కల్లా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతో మణిశర్మని కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా జరిగేలా షెడ్యూల్ చేసారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు