నాని ‘ప్రేమగాథ’ ఓవర్సీస్ లో రికార్డ్ రిలీజ్

నాని ‘ప్రేమగాథ’ ఓవర్సీస్ లో రికార్డ్ రిలీజ్

Published on Feb 10, 2016 2:34 PM IST

krishna-gadi-veera-prema-ga
‘భలే భలే మగాడివోయ్’ అనే క్రేజీ టైటిల్ తో వచ్చి తెలుగు ప్రేక్షకులను తెగ నవ్వించిన నాచురల్ స్టార్ నాని మరోసారి పొడవాటి క్రేజీ టైటిల్ తో చేసిన సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ అందుకొని రిలీజ్ కి అన్నీ క్లియర్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మెయిన్ గా ఈ చిత్ర నిర్మాతలైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సినిమాని ప్రతి ఒక్కరికీ రీచ్ చేయాలని సరికొత్త రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

నాని గత సినిమా హిట్ వలన, అలాగే ఈ సినిమా ట్రైలర్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వలన ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అందుకే ఈ సినిమా బిజినెస్ ఎప్పుడో అయిపొయింది, అలాగే ఇరు రాష్ట్రాల్లో నాని కెరీర్లోనే భారీగా రిలీజ్ అవుతోంది. లోకల్ గానే కాకుండా ఓవర్సీస్ లో కూడా నాని కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతోంది. యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన పిక్సెల్ డ్రీమ్స్ వారు కృష్ణగాడి వీర ప్రేమగాథని ఓవర్సీస్ లో 130కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నారు. మామూలుగా ఒక స్టార్ హీరో సినిమాకే ఈ రేంజ్ స్క్రీన్స్ ఉంటాయి, కానీ నాని గత సినిమా భలే భలే మగాడివోయ్ ఓవర్సీస్ లో 1.5 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది. దాంతో ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు.

మరి భారీ అంచనాల నడుమ నాని కెరీర్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు