నాగ చైతన్య సరసన నితిన్ హీరోయిన్ ?
Published on Sep 13, 2017 8:47 am IST


ఇటీవలే ‘యుద్ధం శరణం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన హీరో నాగ చైతన్య తన తర్వాతి ప్రాజెక్ట్స్ కోసం రెడీ అవుతున్నాడు. ఆయన చేయనున్న సినిమాల్లో చందూ మొండేటి డైరెక్ట్ చేయనున్న ‘సవ్యసాచి’ ఒకటికాగా ఇంకొకటి మారుతి దర్శకత్వంలో ఉండనుంది. ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మారుతి సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ను తీసుకోనున్నారట.

అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నితిన్ తాజా చిత్రం ‘లై’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మేఘా ఆకాష్ పెర్ఫార్మెన్స్ పట్ల తెలుగు ఆడియన్స్ బాగానే ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం ఈమె పవన్, త్రివిక్రమ్ ల ప్రోడక్షన్లో కృష్ణ చైతన్య డైరెక్షన్లో నితిన్ చేస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది.

 
Like us on Facebook