ఇంటర్వ్యూ: సత్య – మనోజ్ ను అలా చూసి మోహన్ బాబుగారు చాలా సంతోషించారు !

ఇంటర్వ్యూ: సత్య – మనోజ్ ను అలా చూసి మోహన్ బాబుగారు చాలా సంతోషించారు !

Published on Feb 24, 2017 7:00 PM IST


రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ‘ అటాక్, శౌర్య’ వంటి వరుస ఫ్లాపుల తర్వాత నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో చేస్తున్న చిత్రమే ఈ ‘గుంటూరోడు’. రిలీజైన ఆడియో, ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది. మనోజ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ కానున్న సందర్బంగా చిత్ర దర్శకుడు సత్య మీడియాతో చెప్పిన విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమాకి మంచు మనోజ్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ?

జ) మంచు మనోజ్ ఇప్పటి దాకా ఇలాంటి సబీజెక్టు చేయలేదు. అన్ని అంశాలు కలిసిన మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. మనోజ్ బాడీ లాగ్వేజ్, ఎనర్జీ, ఎమోషన్స్ పండించగల సత్తా అతనిలో ఉన్నాయి కాబట్టి అతన్ని చూజ్ చేసుకున్నాను. ఈ సినిమా అతని స్థాయి పెంచేదిగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాలో హైలైట్ అంశాలేమిటి ?

జ) ఈ సినిమా ప్రధానంగా కోటా శ్రీనివాస రావు, మనోజ్, రాఅజేంద్ర ప్రసాద్, సంపత్ వంటి నాలుగు ముఖ్య పాత్రల చుట్టూ తిరిగే కథ. కథంతా ఈ పాత్రల చుట్టూ తిరగడం, ఈ పాత్రలపై వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో మనోజ్ ఎమోషనల్ గా నటించే సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది.

ప్ర) చిరంజీవి వాయిస్ ఓవర్ గురించి చెప్పండి ?

జ) సినిమాలోని ప్రధాన పాత్రల్ని పరిచయం చేయడానికి ఒక బలమైన, పాపులర్ వాయిస్ ఓవర్ కావాలని డిసైడయ్యాం. చాలా మందిని అనుకున్నాం. కానీ అవి వర్కవు కాలేదు. చివరికి మనోజ్ చిరంజీవిగారైతే బాగుంటుందని స్వయంగా వెళ్లి ఆయన్ను కలిసి అడిగారు. ఆయన కూడా ఒప్పుకుని వాయిస్ ఇచ్చారు.

ప్ర) సినిమా పట్ల మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ?

జ) సినిమా చాలా బాగా వచ్చింది. రెండు వారాల క్రితమే మంచు ఫ్యామిలీ మొత్తానికి షో వేసి చూపించాం. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ముఖ్యంగా మోహన్ బాబుగారు మనోజ్ ను అలా ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా చూసి చాలా సంతోషించారు.

ప్ర) ప్రగ్య జైస్వాల్ పాత్ర గురించి చెప్పండి ?

జ) ప్రగ్య జైస్వాల్ పాత్రను చాలా అందంగా డిజైన్ చేశాం. ఫస్టాఫ్ లో ఆమెదే కీ రోల్. మనోజ్ పాత్రను హోల్డ్ చేసి పట్టుకుని ఉంటుంది. వాళ్ళిద్దరి జోడీ చాలా బాగా కుదిరింది. ఆమె నటన కూడా చాలా బాగుంటుంది. బాగా కష్టపడి చేసింది.

ప్ర) నిర్మాత గురించి చెప్పండి ?
జ) ఈ చిత్ర నిర్మాత శ్రీవరుణ్ అట్లూరి. అతనికి సినిమాలనంటే చాలా ఇష్టం. సినిమా తీశామంటే తీశామని కాకుండా చాలా శ్రద్ధతో తీశారు. నిర్మాత బాగుంటేనే సినిమా అవుట్ ఫుట్ బాగుంటుంది. ఇక్కడ మా నిర్మాత చాలా బాగా సహకరించాడు కనుక సినిమా అనుకున్నట్టు బాగా వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు