బోయపాటి కోసం కండలు పెంచుతున్న బన్ని

బోయపాటి కోసం కండలు పెంచుతున్న బన్ని

Published on Apr 28, 2015 8:24 AM IST

Allu-arjn
‘రేసుగుర్రం’, ‘S/O సత్యమూర్తి’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – ‘లెజెండ్’ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో విజయం అందుకున్న బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న విషయం ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం సమ్మర్ వకేషణ్ లో ఉన్న అల్లు అర్జున్ మే మిడిల్ లో బోయపాటి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను బోయపాటి శ్రీను తెలియజేశాడు.

‘ నా సినిమాలో బన్నికి ఓ సరికొత్త లుక్ ని ఇవ్వనున్నాను. సరికొత్త గెటప్, సరికొత్త హెయిర్ స్టైల్ తో ఎంతో వైవిధ్యంగా ఉండేలా బన్ని లుక్ ని డిజైన్ చేస్తున్నాం. అంతే కాకుండా ఈ సినిమా కోసం బన్ని మళ్ళీ కండలు పెంచుతున్నాడు. బన్నిని మరో రేంజ్ లో చూపించే సినిమా అవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, ఉంటే ఇద్దరూ కొత్త వాళ్ళు ఉంటారు లేకపోతే ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ ఉంటారు. అలాగే ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ టైటిల్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాం. త్వరలో అధికారికంగా తెలియజేస్తామని’ తెలిపాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు