లుక్స్ తో, టాలెంట్ తో ఆకట్టుకుంటున్న కొత్త విలన్ !

లుక్స్ తో, టాలెంట్ తో ఆకట్టుకుంటున్న కొత్త విలన్ !

Published on Oct 24, 2017 11:35 AM IST


ఈ మధ్య తెలుగు పరిశ్రమలో ప్రతినాయకుడి పాత్రలకి కూడా మంచి ఆదరణ దక్కుతోంది. కొత్త కొత్త యువ నటులు కేవలం విలన్ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. దీంతో మేకర్స్ కు యువ విలన్లు పెద్దగా కష్టపడకుండానే అందుబాటులోకి వస్తున్నారు. అలాంటి యువ విలన్లలో గగన్ విహారి కూడా ఒకరు. వెండితెరకు కావాల్సిన ఛార్మింగ్ లుక్స్ తో పాటు మంచి ఫిజిక్ కలిగి ఆకట్టుకునే పెర్ఫారామెన్స్ ను ఇవ్వగల గగన్ మంచి మంచి సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఆరంభంలో ఇతను కూడా హీరో అవుదామనే పరిశ్రమలోకి అడుగుపెట్టి 2013 లో ‘మ్యూజిక్ మేజిక్’, 2011లో ‘ప్లే’ వంటి సినిమాల్లో కథానాయకుడిగా చేసినా ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలవైపు మళ్ళి ‘పైసా వసూల్, నేనే రాజు నేనే మంత్రి, కాటమరాయుడు, ఎక్కడికి పోతావు చిన్నవాడా, క్షణం, సోగ్గాడి చిన్ని నాయనా, టైగర్, హోరా హోరీ, టైగర్, అత్తారింటికి దారేది, ప్రేమ ఒక మైకం’ వంటి సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన ఆయన తాజాగా విజయం సాధించిన రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో కూడా నటించాడు.

అందులో ప్రధాన విలన్ కి ముద్దుల తమ్ముడిగా నటించిన గగన్ పాత్రతోనే సినిమా అసలు కథ మొదలవుతుంది. ఈ పాత్రతో అతను ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తెలుగు దర్శకులు, నిర్మాతలు ఎక్కడో ముంబైలో నుండి విలన్లని తీసుకుని, రకరకాల ఇబ్బందులు పడే బదులు వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే మన పరిశ్రమకే చెందిన గగన్ విహారి లాంటి స్టైలిష్ విలన్లకు అకాశాలిచ్చి ప్రోత్సహించడం మంచిది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు