నానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన నివేథా!

నానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన నివేథా!

Published on Jun 26, 2016 12:29 AM IST

nani
నివేథా థామస్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ‘జెంటిల్‌మన్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ మళయాలీ హీరోయిన్, తొలి సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా విడుదలైనప్పట్నుంచే నివేథాకు ఫ్యాన్స్ పెరుగుతూ వస్తున్నారు. అందం, అభినయంతో పాటు చక్కగా తెలుగు కూడా మాట్లాడుతూ ఉండడం నివేథాకు అభిమానుల్ని తెచ్చిపెట్టింది. ఇకదీనికితోడు తాజాగా నివేథా తనలోని మరో ప్రతిభను బయటపెట్టి ఫ్యాన్స్‌ను మరోసారి ఆశ్చర్యపరిచారు.

‘జెంటిల్‌మన్’ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో అందులో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో నటించిన నానికి, నివేథా స్వయంగా గీసిన ఓ చిన్న ఆర్ట్‌ను అందజేశారు. ఆ సినిమాలో నాని రెండు పాత్రలను ప్రతిబింబిస్తూ వేసిన ఈ ఆర్ట్‌ను నాని షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక నివేథా థామస్ మల్టీ టాలెంటెడ్ అంటూ ఆమె అభిమానులు ఈ పెయింటింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ సినిమానూ ఒప్పుకొని నివేథాకు పలు పెద్ద సినిమాల్లో నటించమని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు