బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ !

బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ !

Published on May 29, 2017 3:39 PM IST


టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం సినిమాలపైనే కాకుండా టీవీ షోలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. టెలివిజన్ మాద్యమానికున్న స్టామినాను దృష్టిలో పెట్టుకుని, ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యేందుకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ బాటలోనే నడవాలనుకుంటున్నట్టు సమాచారం.

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బాగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షోను తెలుగులో ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా చేయనుందని, దానికి తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియలాంటే ఎన్టీఆర్ లేదా సదరు టీవీ ఛానెల్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఇదే బిగ్ బాస్ షోను తమిళంలో కమల్ హాసన్ చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు