ప్రారంభమైన పద్మావతి ఆర్ట్స్ ప్రొడక్షన్ తొలిసినిమా

Padmavathi-Art-Productions
ఉదయభాస్కర్ జాస్తి సమర్పణలో శ్రీ పద్మావతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.పద్మజ నిర్మిస్తున్న తొలిచిత్రం ప్రారంభోత్సవం గురువారం ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. రవిబాబు, అర్చన, భానుశ్రీ మెహ్రా, వినోద్ కుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభాకరన్ దర్శకుడు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నటుడు శివాజీ రాజా క్లాప్ నిచ్చారు. బి.గోపాల్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ అందజేశారు.

ప్రేక్షకులు మెచ్చే కధాంశంతో సినిమా రూపొందిస్తున్నాం, తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని యూనిట్ సభ్యులు తెలిపారు. శివాజీ రాజా, రవి ప్రకాష్, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తారక రామారావు సంగీతం అందిస్తున్నారు. పార్వతిచంద్ మాటల రచయిత. ఉదయభాస్కర్ జాస్తి సినిమాటోగ్రాఫర్.

 

Like us on Facebook