గోపాల గోపాల – పవన్ కళ్యాణ్ @ మాదాపూర్ ఫ్లై ఓవర్.

గోపాల గోపాల – పవన్ కళ్యాణ్ @ మాదాపూర్ ఫ్లై ఓవర్.

Published on Sep 22, 2014 4:08 PM IST

gopala-gopala
విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ షూటింగ్ గత రెండు రోజుల నుండి హైదరాబాద్ లో గల హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. మాదాపూర్ ఫ్లై ఓవర్ మీద పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. వెంకటేష్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. పవన్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. వెంకటేష్ నార్మల్ లుక్ లో ఉన్నారు.

హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన ‘ఓ మై గాడ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ పార్దసాని(డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు