పవన్ కళ్యాణ్ నా కొడుకు లాంటివాడు – చిరంజీవి

పవన్ కళ్యాణ్ నా కొడుకు లాంటివాడు – చిరంజీవి

Published on Aug 22, 2014 4:00 PM IST

Chiranjeevi-(11)
మెగా ఫ్యామిలీలో అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవికి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ రాజకీయాల్లో తలెత్తిన కారణాల వల్ల పబ్లిక్ లో మాత్రం చిరంజీవి – పవన్ కళ్యాణ్ ల మధ్య విభేదాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

కానీ అవేవి నిజం కాదని పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి అన్నారు. ‘మేము ఇద్దరం ఒకే తల్లి కడుపునా పుట్టాము. పవన్ కళ్యాణ్ నాకు మరో కొడుకు. ఎవరో ఎక్కడో చెప్పుకొంటున్న మాటల్లో వాస్తవం లేదు. మా బంధం అంత బలహీనమైనది కాదు. రాజకీయాల పరంగా ప్రజాసేవ చేయడానికి తనొక మార్గాన్ని ఎన్నుకున్నాడు. అందులో తప్పేముంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడని’ అన్నాడు.

నేడు చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ చిరు చేయబోయే 150వ సినిమా త్వరలోనే మొదలవుతుందని అనౌన్స్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు