కొరటాల శివపై భారీ స్థాయిలో భారం పడింది

కొరటాల శివపై భారీ స్థాయిలో భారం పడింది

Published on Sep 23, 2014 1:35 AM IST

Koratalla-Siva
ఒక అగ్ర నటుడి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించికపోయినా, నిరాశ కలిగించినా ఆ బడా స్టార్ ని తరువాత హ్యాండిల్ చేసే వారిపై భారీ స్థాయిలో ప్రెజర్ పడిపోవడం సహజం

ప్రస్తుతం మహేష్ బాబు రూపంలో కొరటాల శివ కూడా ఇదే చిక్కులో పడ్డాడు. ఈ ఏడాది మహేష్ హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా పరాజయం పాలవ్వగా ఇటీవలే విడుదలైన ‘ఆగడు’ సినిమా సైతం అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది

ఇప్పుడు మహేష్ బాబు ని డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివపై ఈ భారమంతా పడింది. మహేష్ దగ్గరనుండి అతని అభిమానుల వరకూ అతన్ని దగ్గరుండి ఫాలో అవుతున్నారు. మరి ఇంత ప్రెజర్ ని తట్టుకుని మిర్చి దర్శకుడు మనకు హిట్ ఇస్తాడా లేదా అన్నది తెలియాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు