బాలయ్య సరసన నటించే మరో ఇద్దరు హీరోయిన్లు వీళ్లేనా ?
Published on Mar 29, 2017 11:38 am IST


ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఏప్రిల్ 5 నుండి ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించడానికి కొత్త హీరోయిన్ ముస్కాన్ ను ఫైనల్ చేసిన పూరి మరో ఇద్దరు హీరోయిన్లను కూడా సెలక్ట్ చేశాడట. వాళ్లలో ఒకరు అమలాపాల్ అని సమాచారం.

అమలాపాల్ ఇప్పటి వరకు బాలయ్య సరసన నటించకపోవడంతో వారి జోడీ స్క్రీన్ మీద ఫ్రెష్ గా అనిపిస్తుందని, పైగా అమలాపాల్ గతంలో తను డైరెక్ట్ చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించి ఉండటంతో ఆమెను ఖాయం చేశాడట పూరి. ఇక మరొక హీరోయిన్ ఛార్మి అయ్యుండే అవకాశాలు ఉన్నాయని వినికిడి. అయితే ఈ సమాచారంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ అందలేదు. బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో పూర్తిగా కొత్త లుక్ తో కనిపించనున్న ఈ చిత్రానికి సెప్టెంబర్ 29 వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు.

 
Like us on Facebook