మహేష్ బాబు మూవీ న్యూస్ చెప్పిన రాజమౌళి

మహేష్ బాబు మూవీ న్యూస్ చెప్పిన రాజమౌళి

Published on Jul 5, 2015 3:28 PM IST

Mahesh-rajamouli
మీకు ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు అందజేస్తున్నాం.. మొదలు కాక ముందు నుంచి రాజమౌళి బాహుబలి సినిమా ఫినిష్ చేసాక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం ఉంది. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ గా ఈ విషయాన్ని ఖరారు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ ‘మహేష్ బాబుతో సినిమా ఎప్పుడో ఖరారు అయ్యింది. దానికి సంబందించిన అగ్రిమెంట్ పనులు కూడా పూర్తయ్యాయి. కెఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా కోసం మహేహ్స్ బాబు ఎప్పుడో సైన్ చేసాడని’ తెలిపాడు.

ఎప్పుడు అనేది చెప్పకపోయినా సరైన సమయంలోనే ఆ సినిమా మొదలవుతుందని కూడా రాజమౌళి అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి జూలై 10న రిలీజ్ కానున్న బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. రిలీజ్ అవ్వగానే ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని చివరి దశకు తీసుకు వచ్చాడు. ఆగష్టు 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కావునా 2016 సెకండాఫ్ లో వీరి సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు