‘గోవిందుడి..’తో సక్సెస్ అందుకున్న వారసులు.

‘గోవిందుడి..’తో సక్సెస్ అందుకున్న వారసులు.

Published on Oct 1, 2014 2:35 PM IST

charan-yuvan
మెగాస్టార్ చిరంజీవి, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కాంబినేషన్ లో అనేక హిట్ సినిమాలు వచ్చాయి. వారి వారసులు రామ్ చరణ్, యువన్ శంకర్ రాజా కలసి చేసిన సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ఫస్ట్ మూవీతోనే వీరిద్దరూ సక్సెస్ అందుకున్నారు. ఈ రోజు విడుదలైన ‘గోవిందుడు..’ సినిమా నటుడిగా రామ్ చరణ్ కు, సంగీత దర్శకుడిగా యువన్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

తెలుగులో ఇప్పటివరకు యువన్ శంకర్ రాజా సక్సెస్ అందుకోలేదు. అతను సంగీత దర్శకత్వం వహించిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో యువన్ స్వరపరిచిన ఆడియో సూపర్ హిట్ కావడంతో… యువన్ అంటే బ్యాడ్ సెంటిమెంట్ అని ముద్ర పడింది. ఈ సినిమా విజయంతో అది తొలగిపోనుంది. ఇకపై తెలుగులో యువన్ శంకర్ రాజాకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

కృష్ణవంశి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం దసరా పండుగ సమయంలో వచ్చిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. తొలి ఆట నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు