తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్న కథలను ప్రోత్సహిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం, తన ‘KA ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ‘పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్’తో కలిసి మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. వై.శివశంకర్ నాయుడుతో కలిసి కిరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో కుశులు మద్దాల, రెహమాన్, నమ్రిత ఎం.వి., తనుజా పుట్టుస్వామి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన పోస్టర్ వెరైటీగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటీనటులను చూపించకుండా పక్షుల వంటి కాళ్లతో ఉన్న ఒక విచిత్రమైన పోస్టర్‌ను విడుదల చేయగా, ఇది ఎన్నడూ చూడని సరికొత్త జోనర్ సినిమా అని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.


