‘ఆదర్శ కుటుంబం’పై ఫ్యాన్స్ లో నిరాశ.. అప్డేట్ రావాల్సిందే..!

‘ఆదర్శ కుటుంబం’పై ఫ్యాన్స్ లో నిరాశ.. అప్డేట్ రావాల్సిందే..!

Published on Aug 24, 2026 11:01 PM IST

అక్టోబర్ 2న విడుదల కావాల్సిన వెంకటేష్ – త్రివిక్రమ్ క్రేజీ కాంబో మూవీ ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్లపై ఇప్పుడు టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆగస్ట్ గడువు ముగిస్తున్నా, కేవలం మూడు టీజర్లతోనే సరిపెట్టడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి లాంటి మేకర్స్ అడ్వాన్స్‌డ్ ప్రమోషన్లతో దూసుకెళ్తుంటే, ఇంతటి భారీ ప్రాజెక్ట్‌కి ఇప్పటికీ ప్రచార వేగం పుంజుకోకపోవడం గమనార్హం. అనుకున్న సమయానికి అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా సినిమా వస్తేనే సేఫ్ జోన్ ఉంటుందని, లేదంటే త్రివిక్రమ్ పనులు పూర్తి కాక 2027 సమ్మర్‌కి వెళ్లాల్సి వస్తే నిర్మాతలకు అది పెద్ద ఫైనాన్షియల్ రిస్క్‌గా మారుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

​శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, వెంకీతో తొలిసారి చేతులు కలపడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే నిర్మాత నాగవంశీ ఇతర సినిమాల ప్రమోషన్లలో బిజీగా ఉండటంతో ‘ఆదర్శ కుటుంబం’ గురించిన సౌండ్ తగ్గింది. ఒకవేళ అక్టోబర్ డేట్ మిస్ అయితే, ఆ తర్వాత ‘జైలర్ 2’ వంటి పెద్ద సినిమాల పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి ఎలాంటి రిస్క్‌లు లేకుండా అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తాజా వార్తలు