గాయం తర్వాత తొలిసారి బయటకొచ్చిన రష్మిక..!

గాయం తర్వాత తొలిసారి బయటకొచ్చిన రష్మిక..!

Published on Aug 24, 2026 11:35 PM IST

Rashmika-Mandanna

హిప్ గాయం కారణంగా గత కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో కలిసి హైదరాబాద్‌లో కనిపించి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. నిర్మాత నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకలో ఈ జంట సందడి చేయగా, ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో గిరిజన గొండు కమ్యూనిటీ మహిళగా నటిస్తున్న ‘మైసా’ చిత్రంలోని పాట షూటింగ్ సమయంలో రష్మిక గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు దాదాపు ఆరు వారాలు విశ్రాంతి తీసుకుంటున్న ఆమె, త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వివాహం తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై హైప్ పీక్స్‌లో ఉంది. తొలుత సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన ఈ సినిమా, రష్మిక గాయం కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 30కి మారినట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుండటంతో పాటు, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు