వెనకడుగు వేసిన రవితేజ ‘పవర్’..!

Power
మాస్ మహారాజ్ రవితేజ ముందు చెప్పిన టైంకు ‘పవర్’ సినిమాను విడుదల చేయడం లేదు. వారం రోజుల పాటు తన సినిమా విడుదల వాయిదా వేశారు. ముందుగా ‘పవర్’ సినిమాను ఆగస్ట్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ ‘రభస’ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ‘పవర్’ను సెప్టెంబర్ 5వ తేది నాడు విడుదల చేస్తున్నారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రవితేజ సరసన హన్సిక, రెజినా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. ‘బలుపు’ చిత్రానికి కథను అందించిన బాబీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమన్ స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం శిల్పకళా వేదికలో పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ను రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు.

Bookmark and Share