చెన్నై షూటింగ్ లో బిజీగా వున్న సమంత

చెన్నై షూటింగ్ లో బిజీగా వున్న సమంత

Published on Apr 23, 2014 10:15 PM IST

Samantha
కాస్త విరామం తరువాత సమంత కత్తి అనే ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ హీరో. యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ చిత్రాన్ని ఇటీవలే హైదరాబాద్ లో సన్నివేశాలను చిత్రీకరించారు. మురుగదాస్ ఈ సినిమాకు దర్శకుడు

ఈ చిత్రం షూటింగ్ సింహభాగం పూర్తయింది. ఈ చిత్రాన్ని దీపావళికి మనముందుకు తీసుకురానున్నారు. నీల్ నితిన్ ముకేష్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. సమంత సరసన విజయ్ మొదటిసారిగా జతకట్టనుంది. మురుగదాస్, విజయ్ ల కలయికలో వచ్చిన తుపాకి సినిమా గత ఏడాది మంచి విజయం సాధించింది. కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగానే వుండడం సాధారణం

ఈ చిత్రమే కాక సమంత సూర్య అంజాన్ లో కూడా నటిస్తుంది. మరిన్ని సినిమాల విషయాలు త్వరలోనే వెల్లడిస్తుందని సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు