తమిళ్ స్టార్ తో సమంత రెండో సినిమా

తమిళ్ స్టార్ తో సమంత రెండో సినిమా

Published on May 24, 2015 1:56 PM IST

Samantha-
స్వతహాగా తమిళ అమ్మాయి, కానీ ఫస్ట్ బిగ్గెస్ట్ బ్రేక్ మరియు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నది మాత్రం తెలుగులో, అంతే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంత. ఇలా రచ్చ గెలిచిన సమంత ఇంట గెలవడానికి ట్రై చేస్తోంది. అందులో భాగంగానే గత ఏడాది నుంచి తెలుగులో తక్కువగా తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సూర్య, విజయ్, విక్రమ్ సినిమాలలో నటించిన సమంత ప్రస్తుతం ధనుష్ సరసన ‘విఐపి 2’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సమంత మరో తమిళ స్టార్ సినిమాకి సైన్ చేసింది. ఆ హీరో మరెవరో కాదు ఇప్పుడు తను చేస్తున్న ధనుష్ కావడం విశేషం. వెంట వెంటనే ధనుష్ తో రెండవ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ వెట్రిమారన్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ‘వాడా చెన్నై’ సినిమాని సెప్టెంబర్ లో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాకి ధనుష్ సరసన సమంతని ఫైనలైజ్ చేసారు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే ‘S/O సత్యమూర్తి’ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకి సమంత సైన్ చేయలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు