హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు !
Published on Dec 12, 2017 5:43 pm IST

ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్ల వారసులు సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మరొక సీనియర్ హీరోయిన్ కుమారుడు కూడా హీరోగా వెండి తెర మీదకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఆమె మరెవరో కాదు చిరంజీవితో కలిసి ‘ఖైదీ, గ్యాంగ్ లీడర్, స్వయం కృషి’ వంటి సినిమాల్లో నటించిన సుమలత. సుమలత కుమారుడు అభిషేక్ త్వరలోనే హీరోగా కనిపించబోతున్నాడు.

ఈయన్ను కన్నడ దర్శకులైన పవన్ వడియార్ లేదా చేతన్ కుమార్ పరిచయం చేయవచ్చు. నిర్మాత సందేశ్ నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా తెలుస్తోంది. గత కొన్నాళ్ళుగా నటన, మార్షల్ ఆర్ట్స్, డాన్స్ లలో శిక్షణ టీయూస్కున్తున్నాడు అభిషేక్. అభిషేక్ తండ్రి అంబరీష్ కన్నడలో పెద్ద స్టార్ కావడం వలన ఈయన ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 
Like us on Facebook