‘రుద్రమదేవి’కి స్ట్రాంగ్ ఓపెనింగ్స్!

‘రుద్రమదేవి’కి స్ట్రాంగ్ ఓపెనింగ్స్!

Published on Oct 10, 2015 9:26 AM IST

rudramadevi

గుణశేఖర్ ఎన్నో ఏళ్ళ పాటు పరిశోధించి, దాదాపుగా మూడేళ్ళ పాటు ఒకే కల కంటూ రుద్రమదేవి అనే సినిమా కోసం కష్టపడ్డారు. చాలాకాలంగా ప్రేక్షకులను ఎదురుచూయించిన ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అవాంతరాలనూ దాటుకొని నిన్న (అక్టోబర్ 9న) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా కావడం, సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, తెలుగు జాతి వైభవంగా నిలిచిన కాకతీయ సామ్రాజ్యపు వీరవనిత రుద్రమదేవి చారిత్రక కథ కావడం లాంటివన్నీ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచాయి.

ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే నిన్న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు అన్నిచోట్లా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక చారిత్రక కథను ప్రేక్షకులకు చేరవేయాలన్న గుణశేఖర్ ఆలోచనకు, అల్లు అర్జున్, అనుష్కల నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఫీడ్‌బ్యాకే వచ్చింది. ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, కేరళ (మళయాల వర్షన్) ఇలా అన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా 127k డాలర్లు వసూలు చేసి స్ట్రాంగ్‌ ఓపెనింగ్స్ సాధించింది.

రుద్రమదేవిగా అనుష్క నటించగా, గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. రానా, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మళయాలంలోనూ నిన్నే విడుదలైన ఈ సినిమా 2డీ మరియు 3డీ రెండు వర్షన్స్‌లోనూ ప్రదర్శితమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు