‘S/O సత్యమూర్తి’ మళయాల ఆడియో రిలీజ్!

‘S/O సత్యమూర్తి’ మళయాల ఆడియో రిలీజ్!

Published on Apr 21, 2015 5:00 PM IST

son-of-sathyamurthy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొంది ఏప్రిల్ 9న విడుదలైన S/O సత్యమూర్తి.. విడుదలై రెండో వారమైనా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విషయం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా మళయాలంలోనూ విడుదలకు సిద్ధమైంది.

మళయాల పరిశ్రమలో అల్లు అర్జున్‌కున్న క్రేజ్ ఏ స్థాయిదో తెలిసిందే. తెలుగులో ఏ హీరోకూ లేనంత స్టార్‌డమ్ బన్నీకి మళయాలంలో ఉంది. ఈ క్రేజ్ వల్లే బన్నీ సినిమాలు మళయాలంలోకి డబ్ అయి సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడా ఆ కోవలోనే ‘S/O సత్యమూర్తి’ కూడా మళయాలంలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కేరళలో అల్లు అర్జున్ ఈరోజు నుంచే మొదలుపెట్టారు.

భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఆవిష్కరించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో తెలుగులో ఎంత విజయం సాధించిందో తెలిసిందే! ఇక అభిమానుల కేరింతలతో బన్నీ ప్రమోషన్ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారనడంలో సందేహం లేదు. ‘S/O సత్యమూర్తి’ మళయాల వర్షన్ డబ్బింగ్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తి కాగా, ఏప్రిల్ 24న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు