సినిమా పట్ల సంతృప్తిగా ఉన్న సుమంత్ !

సినిమా పట్ల సంతృప్తిగా ఉన్న సుమంత్ !

Published on Jul 18, 2017 5:07 PM IST


‘నరుడా డోనరుడా’ పరాజయంతో డీలాపడిన హీరో సుమంత్ కాస్త గ్యాప్ తీసుకుని సరికొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేశారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా పట్ల సుమంత్ చాలా సంతృప్తిగా ఉన్నారు.

సినిమా ఫైనల్ కట్ చూశాక మంచి ఫీలింగ్ కలిగిందని, సినిమాకు ‘మళ్ళీ రావా’ అనే టైటిల్ ను పెట్టినట్టు ఆయనే స్వయంగా తెలిపారు. కేవలం నెల రోజుల్లో ఒకే ఒక షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాను శైలజ యాదవ్, రాహుల్ యాదవ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టీజర్ ఆగష్టు 3న రిలీజ్ కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు