ఈ నెలాఖరులో సూపర్ స్టార్ సినిమా !

ఈ నెలాఖరులో సూపర్ స్టార్ సినిమా !

Published on Dec 9, 2016 11:01 PM IST

oppam
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘మన్యం పులి’ విజయం తరువాత తన మరో సూపర్ హిట్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసుందుకు సిద్ధమయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ‘మనమంతా, జనతా గ్యారేజ్, మన్యం పులి’ సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడం వలన మోహన్ లాల సినిమా అంటే జనాలు ఆసక్తి చూపుతున్నారన్న విషయాన్ని గ్రహించి ఆయన సినిమాలని తెలుగులోకి డబ్ చేసేందుకు సుముఖత చూపుతున్నారు.

అందుకే మలయాళంలో ఈ 2016 సెప్టెంబర్ లో విడుదలై ఘానా విజయం సాధించిన ‘ఒప్పం’ సినిమాని ‘కనుపాప’ పేరుతో ఈ డిసెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉండే ఈ చిత్రం తెలుగు వాళ్లకు తప్పక నచ్చుతుందని ఈ చిత్ర తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ఓవర్సీస్ నెట్వర్క్స్ ఎంటర్టైన్మెంట్స్ దిలీప్ కుమార్ బోలుగోటి అన్నారు. ఈ సినిమా కథ మొత్తం ఒక చూపు లేని వ్యక్తి, చిన్న పాప, ఒక హత్య కేసు చుట్టూ తిరుగుతుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు