బన్నికి ‘స్మార్ట్ హీరో’ అని కితాబిచ్చిన సూపర్ స్టార్

బన్నికి ‘స్మార్ట్ హీరో’ అని కితాబిచ్చిన సూపర్ స్టార్

Published on Apr 22, 2015 8:28 AM IST

Upendra
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ‘S/O సత్యమూర్తి’. ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అయ్యి అమ్చ్న్హి విజయాన్ని అందుకుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమాలో దేవరాజ్ పాత్రలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను మెప్పించాడు. ఉపేంద్ర కన్నడ హీరో అయినా తను చేసిన ‘ఉపేంద్ర’, రా, ఏ, సూపర్ లాంటి సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది.

‘S/O సత్యమూర్తి’ సక్సెస్ కావడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వర్కింగ్ ఎలా ఉందని అడిగితే ‘ఆర్య సినిమా నుంచి నేను బన్నికి పెద్ద అభిమానిని. బన్ని యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, అన్నిటికంటే తన నటనని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. త్రివిక్రమ్ ఎంత స్మార్ట్ దర్శకుడో, అంతకన్నా స్మార్ట్ హీరో అల్లు అర్జున్’ అని అన్నాడు. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగులో హిట్ అయిన ఈ సినిమాని త్వరలోనే మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు