కొత్త సినిమాకు సైన్ చేసిన సూర్య !

స్టార్ హీరో సూర్యకు తమిళనాట ఎంత క్రేజ్ ఉందో తెలుగునాట కూడా దాదాపు అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం ఇక్కడి ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అందుకే ఆయనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు మార్కెట్ కోసం వాటిని తెలుగులో కూడా రూపొందిస్తూ తమిళంతో పాటు భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంటారు. ఇకపోతే చివరగా ‘సింగం-3’ తో ప్రేక్షకుల్ని పలకరించిన సూర్య మరో కొత్త సినిమాకు సైన్ చేశారు.

అది కూడా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కావడం విశేషం. తెలుగులో ‘7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి రియలిస్టిక్ సినిమాల్ని, తమిళంలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్ని రూపొందించిన సెల్వ రాఘవన్ సూర్యను డైరెక్ట్ చేస్తుండటంతో ఔట్ ఫుట్ పై ఇప్పటి నుండే రకరకాల అంచనాలు ఏర్పడ్డటం మొదలయ్యాయి. ఇకపోతే ఈ ప్రాజెక్టుని జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టుకుని దీపావళి నాటికి రిలీజ్ కానుంది.

 

Like us on Facebook