అందులో తప్పేంటి అంటున్న తమన్నా.!

అందులో తప్పేంటి అంటున్న తమన్నా.!

Published on Jan 29, 2015 8:29 AM IST

tamanah-in-bahubali
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వస్తుంది. ఇది కామన్ కానీ మన ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నా ఆ క్రేజ్ రాదు, రాకపోగా ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారా అనే ఆశ్చర్యార్దకమైన ఒక ప్రశ్న వస్తుంది. ఇదే విషయంలో మిల్క్ బ్యూటీ తమన్నా ముందు ఉంచితే అందులో తప్పేముంది, మల్టీ స్టారర్ అనేది హీరోలకి మాత్రమేనా హీరోయిన్స్ కి ఆ సౌలభ్యం లేదా.? అని అడుగుతోంది.

ఇదే విషయం పై మాట్లాడుతూ ‘సినిమాలో ఇద్దరు ముక్కురు కథానాయికలు ఉంటే అందులో తప్పేముంది. దర్శకుడు ఏం చేసినా సినిమా కోసమే చేస్తాడు కదా అలాంటప్పుడు మాకు అభ్యంతరం ఎందుకు. నేను చూసేది మాత్రం నా పాత్రకి కథలో ఉన్న ప్రాధాన్యం ఎంత అనేది మాత్రమే. ఇంకా చెప్పాలి అంటే సెట్లో మరో హీరోయిన్ ఉంటే పోటీ పడాలని అనిపిస్తుంది. దానివల్ల సినిమాకి మేలే జరుగుతుందని’ తెలిపింది. తమన్నా ఇప్పటికే మల్టీ హీరోయిన్ ఉన్న పలు సినిమాల్లో నటించి ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో ప్రతిష్టాత్మక ‘బాహుబలి’ సినిమాలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు