ప్రముఖ నిర్మాతకు బెదిరింపులు !
Published on Jul 3, 2017 6:13 pm IST


టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కె.ఎల్ దామోదర్ ప్రసాద్ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. నిఖిల్ రస్తోగి అనే వ్యక్తి ఈ ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు అయాన్ కంప్లైంట్లో తెలిపారు. మొదట అతని కాల్ తాను లిఫ్ట్ చేయలేదని, కానీ పలు కాల్స్ తర్వాత లిఫ్ట్ చేయగా అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు.

అంతేగాక తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి. రామకృష్ణ గౌడ్ తనకు డబ్బులిచ్చి అతనితో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని లేకపోతే చంపుతానని బెదిరించమన్నాడని చెప్పినట్లు తెలిపాడు. ఆయన ఫిర్యాదును సేకరించిన పోలీసులు ఐపీసీ 507 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దామోదర్ గతంలో ‘అలా మొదలైంది, హోరా హోరీ, కళ్యాణ్ వైభోగమే, అంతకు ముందు ఆ తర్వాత’ వంటి చిత్రాల్ని నిర్మించారు .

 
Like us on Facebook