ఈ రెండు నెలలను మర్చిపోలేనంటున్న చైతూ!
Published on Nov 14, 2016 9:41 am IST

naga-chaitanya
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన రెండు సినిమాలు వరుసగా నెల తేడాలో విడుదలయ్యాయి. గత నెలలో విడుదలైన ‘ప్రేమమ్’ ఆయన కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా నిలవగా, తాజాగా గత శుక్రవారం విడుదలైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని వెళుతోంది. కరెన్సీ బ్యాన్‌ వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకున్నా మున్ముందు కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ భావిస్తోంది. ఇక ఈ రెండు నెలలు తనకు అద్భుతంగా గడిచాయని, రెండు సినిమాలపై ప్రేక్షకులు కురిపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని నాగ చైతన్య ఈ సందర్భంగా తెలిపారు.

‘ఏమాయ చేశావే’ లాంటి మరిచిపోలేని సినిమా తర్వాత మళ్ళీ అలాంటిదే మరొక సినిమా ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్‌కు చైతూ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు. తమిళవర్షన్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని దూసుకెళుతోంది. రెండు వర్షన్స్‌లోనూ మంజిమ మోహన్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook