రౌడీ బాయ్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

రౌడీ బాయ్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on May 1, 2024 6:00 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆశిష్ హీరోగా “రౌడీ బాయ్స్” అనే యూత్ ఫుల్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యి అదరగొట్టాడు. మరి ఈ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ కి వచ్చి కూడా మళ్ళీ మంచి స్పందనను అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సెల్ఫిష్, రీసెంట్ గా హారర్ ప్రేమకథ “లవ్ మీ” సినిమాలతో రాబోతుండగా తన లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వస్తుంది.

ఇప్పుడు టాలీవుడ్ లో సాలిడ్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా చేస్తున్నట్టుగా ఇప్పుడు లాక్ అయ్యింది. ఇవాళ ఆశిష్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం విశేషం. అంతే కాకుండా ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ లో 30వ సినిమా కావడం గమనార్హం. ఇక ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ఇంకా నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనే అంశాలు ముందు రోజుల్లో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు