ఇంటర్వ్యూ : అనుపమ పరమేశ్వరన్ – టాలీవుడ్ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంది !

ఇంటర్వ్యూ : అనుపమ పరమేశ్వరన్ – టాలీవుడ్ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంది !

Published on Oct 4, 2016 4:56 PM IST

anupama-parameshwaran

మలయాళం ‘ప్రేమమ్’ చిత్రంతో మలయాళీల మనసును కొల్లగొట్టిన నటి ‘అనుపమ పరమేశ్వరన్’ ‘అ.. ఆ..’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరై ప్రస్తుతం నాగ చైతన్య సరసన తెలుగు ‘ప్రేమమ్’ లో నటించింది. ఈ నెల 7వ తేదీన ఈ చిత్రం విడుదలవుతున్న సందర్బంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) ‘ప్రేమమ్’ తెలుగు వెర్షన్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?

జ) దాదాపు ‘ప్రేమమ్’ ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నట్టే ఇందులో కూడా కనిపిస్తాను. కాకపోతే నేటివిటీ పరంగా అక్కడ క్రిష్టియన్,ఇక్కడ హిందూ. ఇందులో నాపేరు సుమ. మలయాళం వెర్షన్ చేసి 2 ఇయర్స్ అవుతోంది కాబట్టి నాలో కొన్ని కొన్ని చేంజెస్ వచ్చాయి అంతే.

ప్ర) టాలీవుడ్ పరిశ్రమ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటోంది ?

జ) తెలుగులో నేను చేసింది రెండే రెండు సినిమాలు. సందులోనూ ఒకటి రిలీజ్ అవ్వాల్సి ఉంది. మూడవ సినిమా చేస్తున్నా. కానీ ఇక్కడి ప్రేక్షకులు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాగ వెళ్లి కదా, మేరీ కదా అని గుర్తుపడుతూ బోలెడంత గౌరవం ఇస్తున్నారు. వాళ్ళ రిసీవింగ్ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.

ప్ర) ఇంతకీ నవీన్ పాల్, నాగ చైతన్యలలో ఎవరు బెటర్ గా చేశారు ?

జ) ఒకరు బెటర్, మరొకరు బాగా చేయలేదు అనేం లేదు. మలయాళంలో నవీన్ అక్కడి నేటివిటీకి తగ్గట్టు బాగా చేశారు. నాగ చైతన్య గారు తెలుగు నేటివిటీకి తగ్గట్టు బాగా నటించారు. ముఖ్యంగా ఏజ్ ఎక్కువగా కనిపించే క్యారెక్టర్లో చాలా బాగా నటించారు నాగ చైతన్య.

ప్ర) తెలుగు పరిశ్రమలో మీరు కంఫర్ట్ గా ఫీలవుతున్నారు ?

జ) అఫ్కోర్స్… ఇక్కడ నాకు చాలా బాగుంది. అందరూ చాలా బాగా గౌరవిస్తున్నారు. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పని చేసిన వాళ్లంతా చాలా మంచి వాళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు. సో హ్యాపీ విత్ తెలుగు పీపుల్ (నవ్వుతూ).

ప్ర) హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎమన్నా చేసే ఆలోచనలున్నాయా ?

జ) అంటే నాక్కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనుంది. అలాంటి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ నాలో ఆ పాత్రలతో సినిమాని నిలబెట్టగల క్యాలిబర్ ఉందన్న పూర్తి నమ్మకం వస్తే తప్పకుండా చేస్తాను.

ప్ర) సినిమాని చూజ్ చేసుకునేటప్పుడు వేటిని దృష్టిలో పెట్టుకుని చూజ్ చేసుకుంటారు ?

జ) సినిమాల్ని చూజ్ చేసుకునేప్పుడు నా క్యారెక్టర్లో డెప్త్ ఉందా లేదా, అది సినిమాని ఎంత వరకూ ప్రభావితం చేస్తుంది, నటించడానికి స్కోప్ ఉందా, కొత్తగా ట్రై చేయడానికి ఛాన్సులేమన్నా ఉన్నాయా అనే వాటిని దృష్టిలో పెట్టుకుని చూజ్ చేసుకుంటా. అంతేగాని రెమ్యునరేషన్ పెద్దగా కన్సిడర్ చేయను.

ప్ర) రియల్ లైఫ్ లో ఎవరినన్నా ప్రేమించారా ?

జ) అంటే… (నవ్వుతూ) ప్రతి ఒక్కరికీ రియల్ లైఫ్ లో, యంగ్ ఏజ్ లో క్రషస్ ఖచ్చితంగా ఉంటాయి. నాక్కూడా అంటే చిన్న చిన్న క్రషెస్ ఉన్నాయ్. కానీ ఇప్పుడు లేవు.

ప్ర) మీరు బేసిక్ గా మలయాళీ కదా. తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా ?

జ) అవును ‘అ..ఆ..’ సినిమాకి డబ్బింగ్ నేనే చెప్పాను. ప్పుడు త్రివిక్రమ్ గారే చెప్పమని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే నా వాయిస్ లో ఇంటెన్సిటీ మారకూడదనే అలా చెప్పారు. నేను కూడా చేసేశాను. ‘ప్రేమమ్’ సినిమాకి కూడా నేనే చెప్పాను. తెలుగులో కొన్ని కొన్ని పదాలు పలకడం చాలా కష్టంగా ఉండేది. నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నాను.

ప్ర) చైతన్యతో పని చేయడం ఎలా ఉంది ?

జ) చైతన్యతో పని చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఆయన డౌన్ టూ ఎర్త్. ప్రతిదీ వివరిస్తారు. మంచి సజషన్స్ ఇస్తారు. సినిమాలో చాలా బాగా నటించారు. చాలా ఈజీ గోయింగ్ పర్సన్. ఎప్పుడూ కూల్ గా ఉంటారు.

ప్ర) మరి దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్ ఎలా ఉంది ?

జ) చందూ.. చాలా టాలెం ఉన్న డైరెక్టర్. పెద్దగా మాట్లాడడు. ప్రతి సీన్ అర్థమయ్యేలా చెప్పారు. కొన్ని సీన్స్ షూ చేసేటప్పుడు ఆయన టాలెంట్ ఏమిటి అర్థమయింది. నేచర్ పరంగా మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. ఆయనతో పని చేయడం హ్యాపీగా ఉంది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి ?

జ) తెలుగులో శర్వానంద్ హీరోగా ‘శతమానం భవతి’ చేస్తున్నాను. తమిళంలో ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు