వాయిదాపడిన ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’

వాయిదాపడిన ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’

Published on Apr 21, 2014 5:28 PM IST

Ulavacharu-Biryani
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘ఉలవచారు బిర్యాని’. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాని మే 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల మంచి రిలీజ్ డేట్ చూసి మే మధ్యలో రిలీజ్ చేస్తామని ఈ చిత్ర సమర్పకుడు కెఎస్ రామారావు తెలిపారు.

ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో కెఎస్ రామారావు మాట్లాడుతూ ‘ ఉలవచారు బిర్యాని చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. నా మిత్రుడి కొడుకు తేజస్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. తేజ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన తేజస్ నటన చూసి ప్రకాష్ రాజ్ హీరోగా తీసుకున్నాడు. తేజస్ కచ్చితంగా ఒక కమర్షియల్ హీరో అవుతాడు. మే మధ్యలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని’ తెలిపారు.

హీరో తేజస్ మాట్లాడుతూ ‘ నీకు నాకు డాష్ డాష్ సినిమాలో హీరో చాన్స్ కోసం వెళ్లాను కానీ డైరెక్టర్ తేజ మాత్రం నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ చేసాడు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలనుకునే లోపు ఉలవచారు బిర్యాని ఆఫర్ వచ్చిందని’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు