రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్, రిలీజ్ డేట్ అప్డేట్ !


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శకుడు సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా చరణ్ సరికొత్త లుక్ లో కనిపిస్తూ, భిన్నమైన కథాంశంతో చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రాజెక్ట్ మొదలుపెట్టిన రోజే ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేసిన టీమ్ ఆ తర్వాత నుండి నిర్విరామంగా షూటింగ్ అయితే జరుపుతున్నారు కానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.

దీంతో అభిమానులు కాస్తంత డీలా పడ్డారు. దీంతో చరణ్ స్వయంగా రంగంలోకి దిగి అభిమానులతో కలిసి సుకుమార్ ను త్వరగా టైటిల్ ఏమిటో ప్రకటించమని సరదాగా కోరారు. దీంతో చిత్ర టీమ్ టైటిల్ మాత్రమే కాక సినిమా విడుదల తేదీని కూడా ఈరోజు ఉదయం 9 – 10 గంటల మధ్యలో చెప్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని చరణ్ తన పేస్ బుక్ ద్వారా అభిమానులకు తెలిపారు. ఇక ఈ ప్రకటనకు ఇంకొద్ది వ్యవధి మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో అలర్ట్ గా ఎదురుచూస్తున్నారు.

 

Like us on Facebook