‘బాహుబలి 2’ లో అవకాశం వస్తే వద్దనుకుంటున్న నటి !

‘బాహుబలి 2’ లో అవకాశం వస్తే వద్దనుకుంటున్న నటి !

Published on Dec 4, 2016 1:00 AM IST

baahuabli-2-kanchana
అలనాటి నటి కాంచన దాదాపు 30 సంవత్సరాల తరువాత తెనుగు సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ దేవరకొండ నటిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ అనే చిత్రంలో ఈమె ముఖ్యమైన బామ్మ పాత్ర పోషిస్తున్నారు. చిత్ర దర్శకుడు ఎంతగానో బ్రతిమిలాడటంతో ఆమె ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రంలో నటిస్తుండగానే ఆమెను ప్రతిష్టాత్మక ‘బాహుబలి 2’ చిత్రం లో నటించాల్సిందిగా రాజమౌళి సంప్రదించారట.

రాజమౌళి ఆమె కోసం డిజైన్ చేసిన పాత్ర, కథ అన్నీఅమెకు బాగా నచ్చాయట. కానీ ఆమె పాత్రకు సంబందించిన షూటింగ్ మొత్తం జోద్ పూర్ లో చేయాల్సి ఉంది. కానీ చలి కాలం కావడంతో అక్కడి వాతావరణం ఈ వయసులో ఆమెకు సరిగా పడకపోవచ్చని, ఇబ్బందిగా ఉంటుందని ఆమె ఈ అవకాశాన్ని గురించి ఆలోచిస్తున్నారట. ఈమె ‘ఆత్మ గౌరవం, ప్రైవేట్ మాస్టర్’ వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి తెలుగువారి గుండెల్లో చెరగని ముదరవేశారు. ఈము ప్రస్తుతం నటిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ చిత్రం వచ్చే సంవత్సరం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు