పతాక సన్నివేశాల చిత్రీకరణలో ‘డైనమైట్‌’

పతాక సన్నివేశాల చిత్రీకరణలో ‘డైనమైట్‌’

Published on Apr 2, 2015 2:18 PM IST

Dynamite

‘వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్‌ సూర్య’ వంటి డిఫరెంట్‌ జోనర్‌ ఫిలింస్‌తో ఇంటెన్స్‌ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకొన్న దర్శకుడు దేవ కట్టా. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘డైనమైట్‌’. మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం హైద్రాబాద్‌, కోట్ల విజయభాస్కర్‌ స్టేడియంలో జరుగుతోంది.

మంచు విష్ణుతోపాటు జె.డి.చక్రవర్తిపై కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 2000 మంది జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ పాల్గొనగా.. విజయ్‌ మాస్టర్‌ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ‘డైనమైట్‌’ టాకీ పార్ట్‌ పూర్తయ్యింది.
ఇటీవల విడుదలైన ‘డైనమైట్‌’ వాయిస్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోందని, త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తామని చిత్ర బృందం చెబుతోంది. వేసవి కానుకగా ‘డైనమైట్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు