సమీక్ష : అనందం – అక్కడక్కడా దొరికింది

సమీక్ష : అనందం – అక్కడక్కడా దొరికింది

Published on Mar 23, 2018 8:33 PM IST
Aanandham movie review

విడుదల తేదీ : మార్చి 23, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అరుణ్‌ కురియన్, థామస్ మాథ్యూ, రోషన్ మాథ్యూ, అను ఆంటోనీ

దర్శకత్వం : గణేష్ రాజ్

నిర్మాత : గురురాజ్

సంగీతం : సచిన్ వారియర్

సినిమాటోగ్రఫర్ : ఆనంద్ ఇ చంద్రన్

ఎడిటర్ : అభినవ్ సుందర్ నాయక్

మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘ఆనందం’ చిత్రాన్ని తెలుగులోకి అదే పేరుతో అనువదించి ఈరోజే రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
ఒకే కాలేజీలో చదువుకుంటున్న నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కాలేజ్ లో ఇండస్టియల్ టూర్ ప్లాన్ చేస్తారు యాజమాన్యం. అందులో భాగంగా విద్యార్థులు టూర్ కు బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో వారంతా జీవితం గురించిన అనేక విషయాల్ని తెలుసుకుంటారు. అలాగే వారిలో వారికి భేధాభిప్రాయాలు కూడ తలెత్తుతాయి. వాటన్నింటినీ దాటుకుని చివరికి వారంతా ఎలా కలుసుకున్నారు, తమకి తాము కొత్తగా ఎలా పరిచయమయ్యారు అనేదే ఈ సినిమా కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో నటించింది అందరు కొత్తవారే అయినప్పటికీ బాగా నటించారు. అందరి సహజమైన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సిద్ది, రోషన్ల పెర్ఫార్మెన్స్ సినిమాలో లోతును పెంచింది. టూర్లో భాగంగా స్టూడెంట్స్ హంపి, గోవా వెళ్తారు. అక్కడ తీసిన సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా చాలా బాగున్నాయి. సెకండాఫ్లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

చిన్న చిన్న కారణాల వలన ఫ్రెండ్స్ మద్య విభేదాలు రావడం, తిరిగి అందరూ వాటిని సరిదిద్దుకోవడం, మళ్ళీ కలుసుకోవడం, అసలియాన్ వ్యక్తులుగా బయటకు రావడం వంటి అంశాలను బాగా తెరకెక్కించారు. ద్వితీయార్థంలో మలయాళ స్టార్ హీరో నవీన్ పౌలి చేసిన చిన్న పాత్ర బాగుంది. యూత్ ను ఉద్దేశించి అతను చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు, ప్రేమలు చాలా సినిమాల్లో చూసాం. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ సినిమా చెయ్యడానికి ప్రేరణ శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్. అందుకే ఈ సినిమాకు హ్యాపీ డేస్ అగైన్ అనే క్యాప్షన్ పెట్టడం జరిగింది. హ్యాపీ డేస్ కథనే కొంత మార్చి మలయాళంలో తియ్యడం జరిగింది, అందుకే ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు నచ్చి ఉండొచ్చు. కాని ఇది మనకు పాత కథే కావున పెద్దగా నచ్చకపోవచ్చు.

స్టూడెంట్స్ మధ్యన నడిచే సరదా సన్నివేశాలు మరీ పెద్దవైన భావన కలిగింది. సినిమాలోని పాటలు ఏమంత గొప్పగా లేవు. సంగీతం ఇలాంటి మూవీస్ లో ప్రదానంగా ఉండాలి కానీ ఈ సినిమాలో అదే లోపించింది. నటీనటుల నటన బాగున్నా వారి మద్యన నడిచే సీన్స్ కొన్ని మరీ స్లోగా నడుస్తూ ఎక్కువ లెంగ్త్ తో విసిగించాయి. బలమైన కథనం, సందర్భాలు ఈ సినిమాలో లేకపోవడం మరో మైనస్. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ సినిమాకు సంభందం లేకుండా వచ్చి వెళ్తుంటాయి.

సాంకేతిక వర్గం:

దర్శకుడు గణేష్ రాజ్ రాసుకున్న పాయింట్ పాతదే అయినప్పటికీ దాన్ని ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన విఫలమయ్యాడు. కానీ ఆయన పాత్రల్ని డిజైన్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది.

సచిన్ వారియర్ అందించిన సంగీతం గొప్పగా లేదు. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలని ఎడిట్ చేసుంటే బాగుండేది. గోవా, హంపి వంటి విహారయాత్ర ప్రదేశాలను సినిమాటోగ్రఫర్ బాగా చూపించడం జరిగింది.

తీర్పు:

మొత్తం మీద ఈ చిత్రం ఎమోషన్స్ మీద నడిచే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనొచ్చు. సినిమాలోని కథ పేక్షకుల్లకు తమ కాలేజీ రోజుల్ని గుర్తుచేస్తుంది. సినిమాను చివర్లో బాగానే ముగించిన ఫస్టాఫ్ మొత్తం నీరసంగా, సాగదీసినట్టు సాగడం, కథ మన తెలుగు ప్రేక్షకులకు పాతదే కావడం, పాత్రలన్నీ బాగానే ఉన్న అందులో నటించిన వారు పూర్తిగా కొత్తవారు కావడంతో సినిమా బిలో యావరేజ్ గా నిలిచింది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు