సమీక్ష : A.K రావ్ P.K రావ్ – హీరోలుగా కూడా నవ్వించాల్సింది.!

సమీక్ష : A.K రావ్ P.K రావ్ – హీరోలుగా కూడా నవ్వించాల్సింది.!

Published on May 17, 2014 7:03 PM IST
Ak-Rao-PK-Rao1 విడుదల తేదీ : 17 మే 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం కోటపాటి శ్రీను
నిర్మాత : సాయి వెంకటేశ్వర కంబైన్స్
సంగీతం : ఎస్.జె
నటీనటులు : తాగుబోతు రమేష్, ధన్ రాజ్, ధక్షనగార్కర్, శృతి రాజ్..

‘జబర్దస్త్’ కామెడీ షోతో ధనాధన్ ధన్ రాజ్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన ధన్ రాజ్, తాగుబోతు పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తాగుబోతు రమేష్ లు హీరోలుగా ధక్షనగార్కర్, శృతి రాజ్ లు హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘A.K రావ్ P.K రావ్’. కోటపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. సినిమాల్లో కమెడియన్స్ గా నవ్వించే ధన్ రాజ్, తాగుబోతు రమేష్ హీరోలుగా ఎంతవరకూ నవ్వించారు అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఏకె రావ్ – పీకె రావ్(ధన్ రాజ్ – తాగుబోతు రమేష్) లు ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరూ అమలాపురంలో చీరలు అమ్మే వ్యాపారం చేస్తుంటారు. ఇలా వ్యాపారం చేసుకుంటూ తమ చెల్లె, భార్యలతో హ్యాపీగా జీవిస్తుంటారు.

వీరిద్దరికీ పోటీగా చీరల వ్యాపారం చేసే కృష్ణ భగవాన్ వేసిన ఓ ప్లాన్ వల్ల ఏకె రావ్ – పీకె రావ్ జైలుకి వెళ్తారు. కొద్ది రోజులకి కృష్ణ భగవాన్ పై పగ తీర్చుకోవాలని ఆ అన్నదమ్ములు జైలు నుండి బయటకి వస్తారు. కృష్ణ భగవాన్ పై పగ తీర్చుకోవడమే కాకుండా వారిద్దరూ డేరింగ్ గా దుబాయ్ డాన్ అయిన దావూద్(రఘుబాబు)కి వ్యతిరేఖంగా కొన్ని పనులు చేస్తుంటారు. అసలు ఏకె రావ్ – పీకె రావ్ లు జైల్లో ఎవరిని కలిసారు? సింపుల్ గా ఉండే వీళ్ళు దావూద్ ని డీ కొట్టడానికి గల కారణం ఏంటి? అనే విషయాలు మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే అది తాగుబోతు రమేష్, ధన రాజ్ లు అనే చెప్పాలి. వీరిద్దరే తన భుజాలపై సినిమా మొత్తాని నడిపించారు మరియు నవ్వించారు. వారిద్దరూ నవ్వించడమే కాకుండా సినిమాలో డాన్సులు, ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించారు.

కృష్ణ భగవాన్ వన్ లైన్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ఆ డైలాగ్స్ ఆడియన్స్ ని బాగా నవ్వించాయి. మొదటి 15 నిమిషాల సినిమా చాలా బాగుంది. హీరోయిన్స్ అయిన ధక్షనగార్కర్, శృతి రాజ్ లు నటన బాగుంది అలాగే పాటల్లో, కొన్ని సీన్స్ లో అందాలు ఆరబోసి ముందు బెంచ్ వారిని కూడా ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ సినిమాలో కమెడియన్స్ ని హీరోలుగా తీసుకున్నాం కదా మళ్ళీ వారితో సెపరేట్ గా కామెడీ చేయించడం ఎందుకు అనుకున్నారో ఏమో హీరో పాత్రల్లో కామెడీ అనేది లేకుండా చేసారు. ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లాంటి కమెడియన్స్ ని పెట్టుకొని కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించలేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ఇంటర్వెల్ బ్లాక్ ముందు నుంచి సినిమా కంటెంట్ పూర్తిగా మార్చేసారు.

సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ఓవర్ గా ఉంటాయి. చూసే ఆడియన్స్ వీళ్ళకు ఇదంతా అవసరమా అనుకుంటారు. ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ నవ్వించలేకపోగా ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. హేమ, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా పెద్దగా నవ్వించలేకపోయాయి. నవ్వించాలని డిజైన్ చేసిన దుబాయ్ డాన్ రఘు బాబు పాత్ర కూడా పెద్దగా నవ్వించలేకపోయింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి ఎస్.జె అందించిన సంగీతం బాగుంది, అలాగే పాటల్లో సాహిత్యం కూడా బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి, విలేజ్ నేటివిటీ డైలాగ్స్ సినిమాకి బాగా సరిపోయాయి. అవసరం లేని సీన్స్ వల్ల సెకండాఫ్ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా సాగింది.

కోటపాటి శ్రీను కథ ఎలా రాసుకున్నా కథనం, డైరెక్షన్ విభాగాలని డీల్ చేయడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా ధన్ రాజ్, తాగుబోతు రమేష్ ల చేత ఆడియన్స్ ని నవ్వించడంలో ఫ్లాప్ అయ్యాడు.

తీర్పు :

‘A.K రావ్ P.K రావ్’ సినిమాలో కమెడియన్స్ అయిన ధన్ రాజ్, తాగుబోతు రమేష్ హీరోలు, కానీ వీళ్ళు కమెడియన్స్ గా చేసిన కామెడీలో సగమైనా హీరోలుగా చేసుంటే బాగుండేది. కానీ ఇందులో వీరి తప్పు కంటే డైరెక్టర్ తప్పే ఎక్కువ ఉందని చెప్పాలి. ఈ సినిమాకి ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లు ప్లస్ పాయింట్స్ అయితే వారిని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ విఫలమవ్వడం ఈ సినిమాకి పెద్ద మైనస్. కమెడియన్స్ గా ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లు సూపర్బ్ గా నవ్విస్తారు, ఇక హీరోలుగా ఇంకా బాగా నవ్విస్తారు అనుకోని వెళితే మీరు నిరాశకి గురవుతారు. అదే ఎక్కువగా అంచనా లేకుండా వెళితే మీరు బెటర్ గా ఫీలవుతారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు