సమీక్ష : దిల్ దివానా – ఆడియన్స్ దిల్ ని గెలవలేకపోయింది.!

సమీక్ష : దిల్ దివానా – ఆడియన్స్ దిల్ ని గెలవలేకపోయింది.!

Published on Feb 8, 2014 3:00 AM IST
di-deewana విడుదల తేదీ : 07 ఫిబ్రవరి 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : తుమ్మ కిరణ్
నిర్మాత : రాజ రెడ్డి
సంగీతం : రామ్ నారాయణ్
నటీనటులు : రోహిత్ రెడ్డి, రాజ్ అర్జున్, కృతిక సింగాల్, నేహ దేశ్ పాండే…



సున్నితమైన సినిమాలు తీసే శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తుమ్మ కిరణ్ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన సినిమా ‘దిల్ దివానా’. ఈ సినిమా ద్వారా రోహిత్ రెడ్డి, రాజ్ అర్జున్ లు హీరోలుగా కృతిక సింగాల్, నేహ దేశ్ పాండే హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. శ్రీ భావన ఫిల్మ్స్ బ్యానర్ పై రాజ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. స్వీట్ రొమాంటిక్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో, ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సినిమా మొదలవ్వగానే ఓ బాచిలర్ పార్టీ. అందులో ఉన్న పవన్(ధన రాజ్), ప్రశాంత్(వేణు)లు తమ లవ్ స్టొరీలను చెప్పడం మొదలు పెడతారు. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రేమకథలు వీళ్ళవి అని ఫీలవుతుంటారు కానీ వీళ్ళు మాత్రం ఈ ప్రేమకథలో పావులు మాత్రమే.

ప్రశాంత్ లవ్ స్టొరీ – సూర్య(రాజ్ అర్జున్) – శ్రీ లక్ష్మీ(కృతిక సింగాల్) ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటుంటారు. సూర్య కి కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు ఉండడం వల్ల పెళ్లిని వాయిదా వేస్తుంటాడు. కానీ శ్రీ లక్ష్మీ మాత్రం తనకి వచ్చే పలు సంబంధాలను చెడగొడుతూ ఉంటుంది. కానీ ఒక రోజు సూర్య – శ్రీ లక్ష్మీ మధ్య గొడవ రావడంతో శ్రీ లక్ష్మీ ప్రశాంత్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది.

పవన్ లవ్ స్టొరీ – సంతోష్(రోహిత్) ఫిల్మ్ డైరెక్టర్ కావాలని ట్రై చేస్తుంటాడు. ఓ రోజు అనుకోకుండా కలిసిన కాస్ట్యూమ్ డిజైనర్ దివ్య(నేహ దేశ్ పాండే)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. సాఫీగా సాగుతున్న ప్రేమకథలో చిన్న ట్విస్ట్. దాంతో సంతోష్ దివ్యకు దూరమైపోతాడు.

పైన చెప్పిన రెండుకథలు ఫస్ట్ హాఫ్ లో విడివిడిగా మొదలైనా సెకండాఫ్ లో మాత్రం ఒకే చెట్టు కిందకి వచ్చి చేరుతాయి. ఆ చెట్టు పేరు టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టు తిలక్ (నాగబాబు). అసలు ఈ తిలక్ ఎవరు? ఈ రెండు ప్రేమకథలకి అతనికి సంబంధం ఏమిటి? విడిపోయిన ఈ రెండు జంటలు చివరికి కలిసాయా? లేదా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో నాగబాబు పోషించిన పాత్ర సినిమాకి చాలా కీలకం. ఆ పాత్రకి ఆయన పూర్తి న్యాయం చేసారు. డైరెక్టర్ కావాలనే కోరిక ఉన్న రోహిత్ చక్కని నటనని కనబరిచాడు. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాజ్ అర్జున్ పరవాలేదనిపించాడు. హీరోయిన్స్ అయిన కృతిక సింఘాల్, నేహ దేశ్ పాండేలు ఓకే అనిపించారు.

ధన్ రాజ్, వేణు ఒక రెండు సన్నివేశాల్లో నవ్వించారు. క్లైమాక్స్ సినిమాకి కాస్త వేగాన్ని తేవడమే కాకుండా, ఓ జస్టిఫికేషన్ ఇచ్చి ముగించాడు. విజువల్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ చాలా స్లోగా ఉండడం. సినిమా ఎంత నిధానంగా మొదలైందో చివరి వరకూ అంతే నిధానంగా ఉంటుంది. ఎక్కడా కాస్త కూడా వేగంగా అనిపించదు. అంత స్లోగా ఉండడం వల్ల సెకండాఫ్ లో చాలా చోట్ల ప్రేక్షకులకి చిన్నపాటి కునుకు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ ఇంకా స్లోగా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లను ప్రేక్షకులు ముందుగానే ఊహించేయగలరు, దానివల్ల ట్విస్ట్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేయలేకపోయాయి. హీరోయిన్స్ ఓకే అనిపించారు, కానీ అదే పాత్రలకి భాష తెలిసన వాళ్ళని పెట్టుకొని ఉంటే ఇంకాస్త ఎనర్జిటిక్ గా పెర్ఫార్మన్స్ చేయించి ఉంటే సినిమాకి హెల్ప్ అయ్యేది.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. ధన్ రాజ్, వేణులు దాదాపు సినిమా మొత్తం ట్రావెల్ అయినా ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా ఎక్కడా ఆడియన్స్ ని నవ్వించలేకపోయారు. వాళ్ళిద్దరినీ డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోయాడు. శేఖర్ కమ్ముల దగ్గర పనిచేయడం వల్ల ఈ చిత్ర డైరెక్టర్ తుమ్మ కిరణ్ కూడా ఆయనలానే స్లో అండ్ స్టడీ మూవీ తియ్యాలనుకున్నాడు. కానీ మరీ స్లోగా తీయడం, స్క్రీన్ ప్లే లో ఆసక్తిని కలిగించకపోవడం వల్ల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

సినిమాని చాలా వరకూ నిలబెట్టింది అంటే అవి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అనే చెప్పాలి. జయపాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేంని బాగా రిచ్ గా, ఆకట్టుకునేలా చూపించాడు. ఇక రామ్ నారాయణ్ అందించిన మ్యూజిక్ లో రెండు పాటలు బాగున్నాయి. అలాగే సీన్ మూడ్ కి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ అస్సలు బాగాలేవు. ఎంటర్టైనింగ్ ఉండేలా రాసుకొని ఉంటే బాగుండేది. ఎడిటర్ చాలా చాలా చోట్ల బోరింగ్ మరియు రిపీటెడ్ గా అనిపించేలా ఉన్న సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది.

ఇక తుమ్మ కిరణ్ కి డైరెక్టర్ గా మొదటి సినిమా… కథ – కథనం – డైరెక్షన్ అనే మూడు పెద్ద భాధ్యతల్ని తీసుకున్నాడు. కథ – కామన్ లవ్ స్టొరీస్, అంతకన్నా ఇంకేమీ లేదు. మొదటి సినిమా కావడం వల్ల కథనం పై అసలు గ్రిప్ లేదు. అందుకే సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. డైరెక్షన్ లో మాత్రం జస్ట్ పాస్ మార్కులు కొట్టేసాడు. బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

యువతను ఆకట్టుకునే ప్రేమ కథాంశంతో వచ్చిన ‘దిల్ దివానా’ సినిమా యువత మరియు ప్రేక్షకుల దిల్ ని దోచుకోలేకపోయింది. ఈ మధ్య యూత్ లవ్ స్టోరీస్ అంటే భూతయిపోయింది, కానీ అది ఈ సినిమాలో కనిపించలేదు. ఆ విషయంలో డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. పరవాలేదనిపించే నటీనటుల పెర్ఫార్మన్స్, గుడ్ విజువల్స్, మంచి మ్యూజిక్ తప్ప ఏమీ లేని ఈ సినిమా యువతను ఆకట్టుకోవడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. బాగా స్లోగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్స్ నచ్చే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు