సమీక్ష : హమ్ తుమ్ – ప్రేక్షకులకి టార్చర్ గ్యారంటీ.!

సమీక్ష : హమ్ తుమ్ – ప్రేక్షకులకి టార్చర్ గ్యారంటీ.!

Published on Feb 15, 2014 3:00 AM IST
hum-thum విడుదల తేది : 14 ఫిబ్రవరి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 1/5
దర్శకత్వం : ఎం. శివరమి రెడ్డి
నిర్మాతలు : రామ్ బిమాన
సంగీతం: మహతి
నటినటులు : మనీష్, సిమ్రాన్ …

మనీష్, సిమ్రాన్ లను హీరో హీరోయిన్ లుగా తెరకు పరిచయం చేస్తూ చేసిన లవ్ ఎంటర్టైనర్ ‘హమ్ తుమ్’. యాపిల్ స్టూడియోస్ బ్యానర్ లో ఎం. శివరామి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి రామ్ భిమాన దర్శకత్వం వహించాడు. మహతి మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో? ఎంతవరకూ ప్రేమికులను మెప్పించిందో చూద్దాం..

కథ :

‘హమ్ తుమ్’ అనే ఒక టీవీ రియాలిటీ షోలో ఫేమస్ ఫాషన్ డిజైనర్ అయిన పల్లవి(సిమ్రాన్) తన ప్రేమకథని మొదలు పెట్టడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఇంజనీరింగ్ చేరిన పల్లవి తన సీనియర్ అయిన చరణ్(మనీష్)తో ప్రేమలో పడుతుంది. కానీ అది వన్ సైడ్ లవ్ మాత్రమే.. తన ప్రేమని చెప్పకుండా చరణ్ కి ఇష్టమైనట్లు పల్లవి తనని తానూ మార్చుకుంటుంది. ఫేర్వల్ డే రోజున పల్లవి తన ప్రేమని చరణ్ కి చెబుతుంది. అప్పుడే పల్లవికి చరణ్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి వెళ్లి పోతుంది. అలా కాలేజ్ లో విడిపోయిన వారిద్దరూ చివరికి కలిసారా? లేదా? చరణ్ నిజంగా వేరే అమ్మాయిని ప్రేమించాడా? లేక పల్లవిని ప్రేమించాడా? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

మనీష్ చూడటానికి బాగున్నాడు. కానీ అతను పోషించింది హీరో పాత్రే అయినప్పటికీ అతనికి పెద్ద ప్రాధాన్యత లేదు, అలాగే సైడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ లకు ఉన్నన్ని డైలాగ్స్ కూడా లేవు. ఓవరాల్ గా క్లైమాక్స్ పరవాలేదనిపిస్తుంది. ‘జబర్దస్త్’ లో పార్టిసిపేట్ చేసే ఒకతను ఇందులో కొద్దిసేపు టాలీవుడ్ హీరోలను ఇమిటేట్ చేసే సీన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే హీరో కంటే హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అలాంటప్పుడు డైరెక్టర్ పాత్రకి కాస్తైనా న్యాయం చేయాల్సిన అమ్మాయిని హీరోయిన్ గా సెలక్ట్ చేసుకోవాల్సి ఉంది. కానీ అక్కడే డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ హీరోయిన్ సిమ్రాన్. ఫస్ట్ హాఫ్ లో డీ గ్లామరైజ్ గా చూపించాలనే ఉద్దేశంతో హీరోయిన్ కి వేసిన మేకప్ అస్సలు బాలేదు. చూడటానికి చాలా చిరాకేస్తుంది. అలాగే ఆమె నటన అస్సలు బాలేదు. ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి ఆడియన్స్ థియేటర్ నుంచి పారిపోవాలనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఒకటి, రెండు సీన్స్ లో మాత్రమే హీరోయిన్ చూడటానికి ఓకే అనేలా ఉంటుంది. హీరోయిన్ కి ఫ్రెండ్స్ గా చేసిన వారు, అలాగే హీరో ఫ్రెండ్ గా కనిపించినతని మేకప్ ప్రేక్షకుల చేత మా వల్ల కాదు బాబోయ్ అని అరిచేట్లు చేసిందంటే మేకప్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోండి..

సీనియర్ కమెడియన్ అయిన ఎంఎస్ నారాయణ చేత హేయించిన బట్లర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ పాత్ర నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. దీనికి తోడు పోసాని అభిమానిగా ఓ పాత్రని క్రియేట్ చేసి పోసాని స్లాంగ్ లో మాట్లాడించి కామెడీ చేయించడానికి ట్రై చేసారు. అది సినిమాకి అవసరం లేకపోగా ప్రేక్షకులకు స్క్రీన్ చించేయాలి అన్నంత కోపాన్ని తెప్పిస్తుంది. సో సినిమాలో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస, ఏవిఎస్, నాగినీడు లాంటి వాళ్ళని సరిగా ఉపయోగించుకోలేదు.

నాకు తెలిసి ఈ సినిమా స్టొరీ లైన్ నేను గోళీకాయలు ఆడుకునే రోజులనాటిది. స్టొరీనే ఓల్డ్ అనుకుంటే దానికన్నా దారుణమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. ప్రతి సీన్ ని, ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ ని ప్రేక్షకులు ముందే ఊహించేయవచ్చు. ఇలా చెబుతున్నానంటే సీన్స్ లో ఎంత కొత్తదనం ఉందనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా మొత్తం నటిస్తుంది, కానీ ఆ ఫీల్ ఆడియన్స్ కి ఒక్కసారి కూడా కలగదు.

సాంకేతిక విభాగం :

తెరమీద కనిపించే వారిలో ఒక్కరూ పెద్దగా మెప్పించలేకపోయినా తేరా వెనుక ఉన్న టెక్నీషియన్స్ లో ఇద్దరు మాత్రం ప్రేక్షకుల గురించి కాస్త ఆలోచించి కాస్త మంచి పని తీరును కనబరిచారు. వాళ్ళే సినిమాటోగ్రాఫర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్. ఓవరాల్ గా సినిమాటోగ్రాఫర్ ఇచ్చిన లోకేషన్స్ ని బాగా చూపించడానికి తన ప్రయత్నం చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ మహతి అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. అన్ని చోట్లా డైలాగ్స్ బాగాలేకపోయినా కొన్ని చోట్ల మాత్రం పరవాలేధనిపిస్తాయి. ఎడిటర్ సినిమాని వేగంగా నడిపించాలన్న ప్రయత్నమే చేయలేదు. డైరెక్టర్ ఎలాగు బోరింగ్ గా తీసాడు కాబట్టి ఎడిటర్ అన్నా కాస్త జాగ్రత్తలు తీసుకొని కత్తిరించి ఉండాల్సింది.

డైరెక్టర్ కి కథ, స్క్రీన్ ప్లే లాంటి విషయాలపైన పత్తులెకపొయినా నటీనటుల నుండి నటన అన్నా రాబట్టుకునే టాలెంట్ ఉండాలి. కానీ అది కూడా ఆయనలో లేకపోవడంతో డైరెక్టర్ గా అత్తర్ ఫ్లాప్ అయ్యాడు. నిర్మాణ విలువలు ఓకే.

తీర్పు :

ప్రేమికుల రోజు కానుకగా వచ్చిన లవ్ ఎంటర్టైనర్ ‘హమ్ తుమ్’ సినిమాలో ప్రేమికులు చూసి ఎంజాయ్ చేసేంత విషయమైతే ఏమీ లేదు, అలా అని మిగతా వాళ్ళు చూడటానికి ఏదో ఉందని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే యూత్ ని ఆకట్టుకోవాలని చేసిన ఈ సినిమాలో యూత్ కి నచ్చేవే ఏమీ లేవంటే మిగతావారికి నచ్చేవి ఏముంటాయి. ఈ సినిమా నిడివి రెండు గంటలే కావడం ఆడియన్స్ ని కాపాడే విషయం అయితే ఆ ఉన్న రెండు గంటల్లోనే ఆడియన్స్ కి చుక్కలు కనపడే రేంజ్ లో టార్చర్ చేయడం అనేది ఆడియన్స్ దురదృష్టకరం. ‘హమ్ తుమ్’ సినిమా అంటే ఆడియన్స్ నహీ అనేలా ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు