పాటల సమీక్ష : కృష్ణార్జున యుద్ధం – ఇంప్రెస్ చేసిన తమిజా

పాటల సమీక్ష : కృష్ణార్జున యుద్ధం – ఇంప్రెస్ చేసిన తమిజా

Published on Mar 27, 2018 12:38 AM IST

మెర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. హిపాప్ తమిజా సంగీతం అందించిన ఈ చిత్రం యొక్క పూర్తి పాటలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. మరి ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : టర్న్ థిస్ పార్టీ అప్ Turn-this-Party

గాయనీ గాయకులు : హిపాప్ తమిజా, బ్రోధా వి
సాహిత్యం : హిపాప్ తమిజా, బ్రోధా వి

నాని చేసిన రెండు పాత్రల్లో ఒకటైన రాక్ స్టార్ పాత్ర నైపథ్యంలో వచ్చే ఈ పాట వెస్ట్రన్ సంగీతంతో నిండిపోయి ఉంది. పైగా తెలుగు పదం అనేదే వినబడకుండా పూర్తిగా ఇంగ్లీష్ లిరిక్స్ తో నిండిపోయిన ఈ పాట మ్యూజిక్ పరంగా అక్కడక్కడా బాగున్నా సాధారణ ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ వినాలని అయితే అనిపించదు.

dhari-choodu2. పాట : దారి చూడు
గాయనీ గాయకులు : పుట్ట పెంచెల దాస్
సాహిత్యం : పుట్ట పెంచెల దాస్

‘దారి చూడు దుమ్ము చూడు మావ’ అంటూ అచ్చ తెలుగు పల్లెటూరి పదాలతో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం వినసొంపుగా ఉంది. క్లాస్, మాస్ రెండు ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉండటమే ఈ పాటలోని ప్రత్యేకత. రచయిత పుట్ట పెంచెల దాస్ రాసిన ‘కమలపూడి కట్ట మింద మామ కన్నెపిల్లల జోరే జూడు, కురస కురస అడవిలోన పిలగా కురిసెనే గాంధారి వాన’ లిరిక్స్ కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇక ఆయన పాడిన తీరు కూడ పాటను మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేసింది. సంగీత దర్శకుడు హిపాప్ తమిజా మాస్ బీట్స్ ఎంతగానో అలరించాయి.

3. పాట : నా కనులే కనని i-wana-fly
గాయనీ గాయకులు : రేవంత్, సంచిత హెగ్డే
సాహిత్యం : శ్రీజో

‘నా కనులే కనని ఆ కలనే కలిశా’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాగే ఈ పాట వినడానికి బాగానే ఉంది. తమిజా ఈ పాటకు అందించిన సంగీతం కొంత పాత స్టైల్లో అనిపిస్తున్నా వింటున్నంతసేపు అలరిస్తుంది. శ్రీజో రాసిన రాసిన సాహిత్యం కూడ పర్వాలేదు. రేవంత్, సంచిత హెగ్డేల గాత్రం బాగుంది.

ela-ela4. పాట : ఎలా ఎలా
గాయనీ గాయకులు : యాజిన్ నాజిర్
సాహిత్యం : శ్రీమణి

‘ఎలా ఎలా మారింది’ నా కథే అంటూ సాగే ఈ పాట కూడా నార్మల్ గానే ఉంది. ‘ధ్వంసమైన కలలు కుమ్మరించి, రాలిపోయిన పూలు పోగుచేసి కానుకల్లె స్వీకరించమంటావే’ అంటూ శ్రీమణి రాసిన బరువైన లిరిక్స్ పాటలో లోతును పెంచాయి. ఇక తమిజా అందించిన సంగీతం పర్వాలేదనేలా ఉండగా యాజిన్ నాజిర్ గాత్రం పాటకు సరిగ్గా కుదిరింది.

5. పాట : ఉరిమే మనసే side
గాయనీ గాయకులు : రఘు దీక్షిత్
సాహిత్యం : శ్రీజో

ఈ పాట వినడానికి కొంత భిన్నంగా ఉంది. తమిజా అందించిన స్వరాలు, గాయకుడు రఘు దీక్షిత్ పాటను పాడిన స్టైల్ పాటను బరువైన ఫీలింగ్స్ తో నింపి అన్ని పాటల్లోకి కొంత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ‘ఉన్న చోట ఉండనీయదె ఉరిమే మనసే.. రెప్పనైన వేయనీదే తరిమే మనసే’ వంటి శ్రీజో రాసిన సాహిత్యం కూడ బాగుంది. ఆడియోలో ఉత్తమమైన పాటల్లో ఇది కూడ ఒకటని చెప్పొచ్చు.

thaney6. పాట : తానే వచ్చిందనా
గాయనీ గాయకులు : కాల భైరవ, పద్మావతి
సాహిత్యం : కె.కె

ఈ పాట కూడ వినడానికి బాగున్నా ప్రత్యేకంగా, కొత్తగా ఏం లేదు. ఇందులో ఆరంభం సాధారణంగానే ఉన్నా పోను పోను పాట బాగానే అనిపిస్తుంది. ఈ పాటకు తమిజా అందించిన స్వరాలు బాగున్నాయి. కె. కె రాసిన లిరిక్స్ మెప్పించగా కాల భైరవ, పద్మావతిలు పాటను పాడిన విధానం మెప్పిస్తుంది.

తీర్పు:

మొత్తం ఆరు పాటల్ని కలిగి ఉన్న ఈ ‘కృష్ణార్జున యుద్ధం’ ఆడియోలో ‘దారి చూడు, ఎలా ఎలా, ఉరిమే మనసే ‘ వంటి పాటలు ఆకట్టుకోగా మిలిగిలిన మూడు పాటలు సాధారణంగానే ఉన్నాయి. సంగీత దర్శకుడు తమిజా కొన్ని పాటల్లో చప్పట్లు కొట్టేలా చేసినా ఇంకొన్ని పాటల్లో పర్వాలేదనిపించారు. మొత్తం మీద సంగీత దర్శకుడిగా ఆయన ఈ పాటలతో ఇంప్రెస్ చేశారనే అనొచ్చు.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు