సమీక్ష : బంగారు కోడిపెట్ట – ఈ కోడి చాలా స్లో..

సమీక్ష : బంగారు కోడిపెట్ట – ఈ కోడి చాలా స్లో..

Published on Mar 7, 2014 7:32 PM IST
bangaru-kodipetta-telugu విడుదల తేది : 7 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.75 /5
దర్శకత్వం : రాజ్ పిప్పల
నిర్మాతలు : సునీత తాటి
సంగీతం : మహేష్ శంకర్
నటినటులునవదీప్, స్వాతి రెడ్డ

నవదీప్ హీరోగా, స్వాతి హీరోయిన్ గా నటించిన సినిమా ‘బంగారు కోడిపెట్ట’. రాజ్ పిప్పళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సునీత తాటి నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ :

భానుమతి (స్వాతి) ఎనర్జీ డ్రింక్ కంపెనీ లో సేల్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తూ వుంటుంది. ఆమెకు చాలా డబ్బు అవసరం అవుతుంది. ఆమె బాస్ (హర్ష వర్ధన్) ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.

నవదీప్ ఒక మాల్ లో సౌండ్ టెక్నీషియన్ గా పని చేస్తూ వుంటాడు. భానుమతి, వంశీ (నవదీప్) వారి ఇబ్బందులకు విసుగు చెంది ఓ పథకం ఆలోచిస్తారు. వారిద్దరూ కలిసి భానుమతి కంపెనీ యొక్క బంగారం రవాణా చేసే ట్రాక్ ని దోపిడీ చేయాలనుకుంటారు.

వారి ప్లాన్ బయట తెలిసిపోతుంది. వారి దురదృష్టం కొద్దీ కథ పిజ్జా డెలివరీ బాయ్ గా, భీమవరంలో డబ్బున్న భూస్వామితో ముడిపడుతుంది. ఆ తర్వాత ఎం జరిగింది? భానుమతి, వంశీ దోపిడీ చేస్తారా?లేదా? వారికి ఆ బంగారం దొరుకుతుందా? లేదా ? తెలియాలంటే ‘బంగారు కోడిపెట్ట’ సినిమా చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో నవదీప్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను నటించిన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. అతను చూడటానికి చాలా అందంగా వున్నాడు. అమాయకమైన అమ్మాయి భానుమతిగా స్వాతి బాగా చేసింది. హర్షవర్దన్ అమ్మాయిల పిచ్చి గల బాస్ గా తన పాత్రలో జీవించాడు. ఆ పాత్ర చివర్లో చేసే మోసం చాలా సుపర్బ్ గా అనిపిస్తుంది.
సినిమా చివరి 20 నిముషాలు చాలా బాగుంది. అలాగే అన్ని రకాల ఎలిమెంట్స్ నిక్లైమాక్స్ లో బాగా కనెక్ట్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో స్వాతి చూడటానికి అంట బాగా లేదు. డైరెక్టర్ ఆమెని సరిగ్గా చూపించడంలో విఫలం అయ్యాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా నెమ్మదిగా, బోరింగ్ గా సాగుతుంది. ఈ సినిమా ఇంటర్వల్ తరువాత కాస్త వేగాన్ని పుంజుకుంటుంది. మళ్ళి కొద్ది సేపట్లోనే స్లో అయిపోతుంది. పిజ్జా డెలివరీ బాయ్ పాత్ర అంత బాగోలేదు. అక్కడ కొన్ని సన్నివేశాలను అనవసరంగా చిత్రీకరించారు.

ఈ సినిమాలో ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ లు నటించారు. వారు ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ కి ఒకే విదంగా ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం అంత బాగోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొన్ని చిన్న చిన్న ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి కనెక్ట్ అయ్యి ఉంటే సినిమాకి హెల్ప్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే విసువల్స్ యదార్థంగా జరిగిన ఫీల్ ను కలిగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాములుగా వుంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. సినిమా స్టొరీ బాగుంది. కానీ డైరెక్టర్ రాజ్ పిప్పళ్ళ దానిని సరిగ్గా చూపించలేకపోయాడు. ఆయన క్లైమాక్స్ సన్నివేశాలను బాగా చిత్రీకరించాడు.

తీర్పు :

చివరి 20 నిముషాలు మినహా మిగిలిన సినిమా మొత్తం కాస్త బోరింగ్ గా వుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఓవరాల్ గా ఈ క్రైమ్ డ్రామా మంచి మార్కులు దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఎ సెంటర్స్ లలో ఒకమాదిరిగా ఆడే అవకాశం ఉంది.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75 /5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు