సమీక్ష : ‘ఎదురులేని అలెగ్జాండర్’ – పసలేని యాక్షన్ డ్రామా

సమీక్ష : ‘ఎదురులేని అలెగ్జాండర్’ – పసలేని యాక్షన్ డ్రామా

Published on Mar 30, 2014 3:30 AM IST
Eduruleni-Alexander-Telugu- విడుదల తేది : 29 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకత్వం : పీఎల్ కె రెడ్డి
నిర్మాత : పీఎల్ కె రెడ్డి
సంగీతం : డా. జోస్యబట్ల వర్మ
నటినటులు : నందమూరి తారకరత్న, కోమల్ ఝా


నందమూరి వారి కుటుంబం నుండి మరో సినిమా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. పీఎల్ కె రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఎదురులేని అలెగ్జాండర్’లో నందమూరి తారకరత్న, కోమల్ ఝా హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ:

అలెగ్జాండర్ (తారకరత్న), విశాఖపట్నంలో ఓ పొలిసు ఇన్స్పెక్టర్. నగరంలో అన్యాయాన్ని అరికడుతు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. ఒక రోజు
అలెగ్జాండర్ విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు బదిలి అవుతాడు.

జిన్నాబాయి (రవి బాబు) మరియు కొట్టప్ప(జయప్రకాశ్ రెడ్డి)లు హైదరబాద్ లో భూ కబ్జాలు, వ్యబిచారం లాంటి చట్టవ్యేతిరేఖ పనులు చేస్తుంటారు. కాలేజి అబ్బాయిల సహాయంతో జిన్నబాయి, యువతులను ట్రాప్ చేసి వ్యబిచారంలోకి దిమ్పుతాడు. మిగతా కథ అంతా, అలెగ్జాండర్ ఈ అక్రమాలను ఎలా అరికడుతాడు అనే దానిపైనే నడుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

నందమూరి తారకరత్న ఎప్పటి లాగానే తనదైన శైలిలో మెచ్చుకోదగిన నటన కనబరిచారు. కొన్ని సన్నివేశాలలో తన డైలాగ్ డెలివరి బాగుంది. రవి బాబు తన నటనకు న్యాయం చేశాడు. ప్రస్తుత యువత డబుల కోసం, తమ లక్ష్యాలను, తల్లిదండ్రుల కోరికలను పక్కన బెట్టి పక్కదారి పడుతున్నారనే సందేశం, ఈ చిత్రంలో ఉంది.

మైనస్ పాయింట్స్ :

హీరోని పరిచయం చేసిన విదానం చాలా సాధారణంగా ఉంది. హీరోయిన్ కోమల్ ఝా కేవలం పాటలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాలేదు. అనవసరమైన సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.

ఈ చిత్రంలో వినోదం కూడా లేదు అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా చప్పగా ఉంది. సినిమా చాలా నేమధిగా సాగదిసినట్టుగా ఉంటుంది, అంతే కాకుండా పొడవైన డైలాగులు ప్రేక్షకులను ఇబ్బంది పెడుతాయి. ఫ్యామిలి ప్రేక్షకులని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అధిక మోతాదులో ఉన్నాయి.

ఎక్కువగా తెలిసిన నటినటులు లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్ పాయింటే. పూర్తి సినిమా ఊహాజనితంగా, రొటీన్ గా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

కెమరా వర్క్ బాగోలేదు, సినిమా నాణ్యత కూడా అంతంత మాత్రమే. ఎడిటర్ చాలా సన్నివేశాలని కట్ చేస్తే బాగుండేది. ముందుగా చెప్పినట్టుగానే, ఈ సినిమా పాటలు కూడా ఏవో ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టుగానే ఉంటాయి.

యువతను అక్కట్టుకునే కొన్ని డైలాగులు మినహా మిగతావి లాగినట్టుగా ఉంటాయి. డైరెక్టర్ ఒక సందేశాత్మక సినిమా తీయడానికి ప్రయత్నించినప్పటికీ, అందులో పూర్తిగా విఫలమైయాడనే చేపుకోవచ్చు.

తీర్పు:

మొత్తం మీద, ఈ ‘ఎదురులేని అలెగ్జాండర్’లో ఏ మాత్రం పస లేదు. తారకరత్న హిట్ కొట్టాలంటే మరో మంచి కథ కోసం ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమా చూడక పోవడమే మంచిది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 1.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు