గ్రాండ్ విజువల్స్ తో పాటు స్ట్రాంగ్ స్టొరీ ఉంటుంది – ప్రభాస్

prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదరి సారి కింగ్ మరియు వారియర్ గా కనిపించనున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ప్రభాస్ ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలపైనే సమయాన్ని కేటాయించాడు. తన ఇన్నేళ్ళ కష్టానికి ఫలితమే ‘బాహుబలి – ది బిగెనింగ్’ గా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రచార కార్యక్రమాలు ముంబైలో జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలతో పాటు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిలు కూడా పాల్గొంటున్నారు.

బాహుబలి సినిమాలో అందరూ ఊహించిన హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ దానికంటే మించి కథ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ప్రభాస్ అన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ ‘బాహుబలికి మొదటి హైలైట్ స్ట్రాంగ్ స్టొరీ. అందరూ ఊహించిన హై రేంజ్ గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. అలాగే నాది, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ పాత్రల గురించి చెప్పినప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయని’ అన్నాడు. ప్రభాస్ – రానా అన్నదమ్ములుగా కనిపిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించారు.

ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అన్ని భాషల్లోనూ ‘బాహుబలి’ అనే టైటిల్ తో రిలీజ్ అవుతుండడం విశేషం.

Exit mobile version