‘వేర్ ఈజ్ విద్యా బాలన్’ కి రిలీజ్ ముందే లాభాలు.!

wher-is-vidyabalan

సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథ’ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రాఘ. ఆయన చేసిన మరో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే ‘వేర్ ఈజ్ విద్యాబాలన్.?’. బస్ స్టాప్, రొమాన్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా జ్యోతిసేతి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక స్టార్ హీరో సినిమా బిజినెస్ అంతా దాదాపు రిలీజ్ ముందే అయిపోతుంది కానీ ఈ మధ్య వస్తున్న చిన్న సినిమాలకు మాత్రం రిలీజ్ తీదీ వరకూ సరైన బిజినెస్ అవ్వడం లేదు. కానీ ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నామని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అంటోంది. వారు సుమారు 2.4 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తే ఇప్పటికే 2 కోట్ల బిజినెస్ అయిపోయిందని, ఇక మిగిలి ఉన్న ఏరియాల బిజినెస్ తో తమ బడ్జెట్ రికవర్ అయిపోతే, శాటిలైట్ రైట్స్ తో కలుపుకొని టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నామని నిర్మాతలు అంటున్నారు. ఈ సినిమాకి రిలీజ్ ముందే ఇంత బిజినెస్ కావడానికి కారణం ఏంటంటే.. అందరు డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమాని ముందే చూపించాం, వారికి సినిమా బాగా నచ్చే ఈ సినిమా తీసుకున్నారని నిర్మాతలు చెబుతున్నారు.

ఒక చిన్న సినిమాకి రిలీజ్ ముందే ఇంట మంచిగా బిజినెస్ అవ్వడం ఇండస్ట్రీకి శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎల్.వేణుగోపాల్‌ రెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి కలిసి నిర్మించిన ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నాడు.

Exit mobile version